తెలంగాణ

గురునాథం కుటుంబానికి సిబ్బంది విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ వద్ద డ్రైవర్‌గా పనిచేసి, అగ్నికి ఆహుతైన గురునాథానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించామని ట్రెసా (తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్) అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఈ మేరకు మీడియాకు సమాచారం అందించారు. అలాగే గురునాథం భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఒక ఇల్లు కూడా ఇప్పించాలని ప్రయత్నిస్తున్నామని వివరించారు. తెలంగాణ వీఆర్‌ఓల సంఘం తరఫున 1,15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నామని ఈ సంఘం నేతలు తెలిపారు. తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ తరఫున లక్ష రూపాయల సాయం చేస్తామని, ఈ నెల 12 న గురునాథం సొంత ఊరికి వెళ్లి ఈ సాయం వారి కుటుంబానికి అందిస్తామని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు కె. చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి మధు తెలిపారు.