తెలంగాణ

జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, నవంబర్ 9: ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు, అక్కడి ప్రాజెక్కుల నుంచి విడుదలవుతున్న వరద నీటితో జూరాలకు స్వల్పంగా వరద ఉద్ధృతి పెరిగింది. శనివారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.490 మీటర్ల స్థాయిలో 9.603 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 83వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లను తెరిచి దిగువకు 43,524 క్యూసెక్కులను, విద్యుత్ ఉత్పత్తికి 35,837, నెట్టెంపాడుకు 1500, భీమా లిఫ్ట్-1కు 650, లిఫ్ట్-2కు 750, సమాంతర కాలువకు 750, జూరాల కుడి, ఎడమ కాలువలకు 2,110, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కుల చొప్పున జూరాల నుంచి 84,854 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
నారాయణపూర్ జలాశయంలో 492.22 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా 30వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నాలుగు గేట్లను తెరిచి దిగువకు 24,560 క్యూసెక్కులను వదులుతున్నారు. ఆల్మట్టి జలాశయంలో 128.19 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 32,631 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువకు 32,631 క్యూసెక్కులను వదులుతున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు.

*చిత్రం... జూరాల గేట్ల ద్వారావిడుదల అవుతున్న వరద నీరు