తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దమందడి, నవంబర్ 9: రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి అయిందని అంచనా వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగానికి సాంకేతికను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని జంగమాయపల్లి గ్రామంలో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయె కాలంలో పంటల మార్పిడి విధానం ద్వారా వ్యవసాయం చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 120 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామంలో మార్కెట్ ఏర్పాటు అయిందన్నారు. అదేవిధంగా చెరువులు, కాల్వల ద్వారా సాగునీరు అందని ఎతె్తైన పంట పొలాలకు మోటార్ల సహయంతో చిన్న చిన్న లీఫ్ట్‌ల ద్వారా సాగునీరు అందిస్తామని అన్నారు. సాగునీరు అందడం లేదని రైతులు ఎవ్వరు కూడా బాదపడవద్దన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమమే అభివృద్ధే ద్యేయంగా దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ గణేష్, డీఆర్‌ఓ వెంకటయ్య, ఎంపిపి మెగారెడ్డి, జడ్పిటిసి రఘుపతిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు రాజప్రకాష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటస్వామి, సర్పంచ్‌లు జయంతి, సతీష్, ఎంపిటిసిలు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
*చిత్రం... జంగమాయపల్లిలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి