తెలంగాణ

మాది పేదల పక్షపాత ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడ్జిల్, నవంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కూలీలు ఆగస్టు 4వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించిన 13మంది మృతుల కుటుంబాలకు గాయాల బారిన పడ్డ ఐదుగురికి ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మనె్న శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు ప్రమాదంలో చనిపోయిన 13మంది కుటుంబాలకు ప్రకటించిన విధంగా ఆర్థిక సాయం అందజేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కేసీఅర్ దగ్గరకు వెళ్లి చనిపోయిన వారి కుటుంబాల పరిస్థితులను వివరించడం జరిగిందన్నారు. వెంటనే స్పదించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సహయం చెల్లించాలని అందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఆప్రక్రియలో భాగంగానే నేడు బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ జరిగిందన్నారు. జిల్లాలో గత ప్రభుత్వాలు కూడ అందించని విధంగా మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం ఒకొక్క కుటుంబానికి రూ. 5లక్షలు, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 2లక్షలు రూపాయల చెక్కులను మంజూరు చేసి బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వం కనుకనే వారి సమస్యలను దృష్ఠిలో ఉంచ్చుకోని గాయపడిన 5మందికి ఒకొక్కరికి లక్ష రూపాయల చెక్కులను అందజేయడం జరిగిందన్నారు.
ఇలాంటి ప్రభుత్వాన్ని కొంతమంది వారి స్వార్త రాజకీయాల కోసం శవాలను అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు జిల్లాలో ఎక్కడైన ఇంత భారి మోతంలో ప్రమాదంలో చనిపొయిన వారికి ఎక్కడైనా ఆర్థిక సహయం అందజేయలేదని మంత్రి గుర్తు చేశారు. చనిపొయిన వారిలో 7మందికి రైతు భీమా రూ.5లక్షల రూపాయలను వారివారి బ్యాంకు ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, అర్డీఓ శ్రీనివాస్, తహశీల్దార్ రామచంద్రయ్య, సర్పంచ్ దేవేందర్, జడ్పీటీసీ శశిరేఖ. వివిధ శాఖల అధికారులు, నాయకులు భాలు, బాల్‌రెడ్డి, దానేలు, బాలయ్య, సుదర్శన్, శివప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచ్చులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి