తెలంగాణ

నిర్బంధాలు మమ్మల్ని ఆపలేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: కార్మికుల సమ్మెకు మద్దతుగా చేపట్టిన ట్యాంక్‌బండ్ మార్చ్ కార్యక్రమం విజయవంతమైందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సకలజనుల సామూహిక దీక్షకు తరలి వచ్చిన అన్ని వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శాంతియుతంగా చలో ట్యాంక్‌బండ్ కార్యక్రామాన్ని జేఏసీ నిర్వహిస్తుంటే, ప్రభుత్వం నిర్భందాలు సృష్టించడం సమంజసం కాదన్నారు. సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉద్యమాలు నిర్వహించడం ప్రజల హక్కు అంటూ ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా తన మొండివైఖరిని విడనాడాలని ఆయన సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను మరింత జఠిలం కాకుండా సీఎం తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. జేఏసీని విచ్ఛిన్నం చేయడానకి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడసికొట్టాయని ఆయన అన్నారు. చలో ట్యాంక్‌బండ్ కార్యాక్రమంకు వస్తున్న వేలాది మంది కార్మికులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు హైదరాబాద్‌కు వస్తుంటే దారిమధ్యలో పోలీసులు కాపుకాచి వారిని అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే ప్రజలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమానకి వస్తున్న మహిళా కార్మికులను బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించడం ఏమిటని ఆయన నిలదీశారు.