తెలంగాణ

ఎక్కడికక్కడే అరెస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: నిరవధిక సమ్మెలో భాగంగా చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపు ఇచ్చిన జేఏసీ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. సకలజనుల సామూహిక దీక్షకు మద్దతు పలికిన అన్ని వర్గాల ప్రతినిధులను అరెస్టు చేశారు. ట్యాంక్‌బండ్ వైపు వస్తున్న జేఏసీ కర్వీనర్ అశ్వత్థామరెడ్డిని లిబర్టీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. మరో నేత రాజిరెడ్డిని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరిలించారు. సాయింత్రం 6 గంటల సమయంలో రాజిరెడ్డిని విడుదల చేశారు. మరోనేత మునిరాజ్ హనుమంతారావు అసెంబ్లీ వద్ద అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్ డిపోల జేఏసీ నేతల్ని నిర్బంధంలోకి తీసుకున్నారు. చలో ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్న జిల్లాల జేఏసీ నేతల్లి మార్గంలోనే బస్‌ల నుంచి దింపేశారు.
టీఎస్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డిని పాత ఎమ్మెల్యే క్వాటర్స్ వద్ద గృహ నిర్భందం చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డ్ నుంచి బయలుదేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అరుణోదయ సమాఖ్య నాయకురాలు విమలక్క, జూలకంటి రంగారెడ్డిలను అరెస్టు చేశారు. సీపీఐ సీనియర్ నేత నారాయణను ట్యాంక్‌బండ్ వైపు వస్తుంటే లిబర్టీ వద్ద అరెస్టు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నేత బండి సంజయ్ ట్యాంక్‌బండ్‌కు ద్విచక్ర వాహనంపై వస్తుంటే అందేద్కర్ విగ్రహం వద్ద అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా బండి సంజయ్ కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉస్మానియా విద్యార్థులను వర్సిటీలోనే పోలీసులు అరెస్టు చేశారు.