తెలంగాణ

ఇదేమి అణచివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: తమ డిమాండ్‌ల సాధనకు శాంతియుతంగా ర్యాలీ చేయడానికి కూడా అనుమతి ఇవ్వకుండా పోలీసుల ద్వారా అణచివేసేందుకు కేసీఆర్ సర్కార్ దుర్మార్గాలకు పాల్పడిందని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ఆర్టీసీ జాక్ ఇచ్చిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు నిరోధించారని, ఇంటి నుంచి బయటకు రానివ్వలేదన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇంతటి నిర్బంధ కాండ ఎక్కడా లేదన్నారు. పోలీసులు శాంతి భద్రతలను కాపాడే ఉద్యోగులుగా కాకుండా, ప్రతిపక్షనేతలను, హక్కులను అడిగే వారిని నిర్బంధించే వ్యక్తులుగా మిగిలిపోయారాన్నరు. కనీస హక్కులు, వాక్ స్వతంత్రం లేకుండా తెలంగాణలో ప్రజలుల బానిసలుగా బతకాలని భావిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో అణచివేతకు తావులేదన్నారు. ప్రపంచ చరిత్రలో నియంతల గతి ఏమైందో 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు తెలియనది కాదన్నారు. పీసీసీ నేత మల్లు రవి మాట్లాడుతూ అక్రమ అరెస్టులను ఖండించారు. హైకోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా ప్రభుత్వం స్పందించకపోవడం మూర్ఖత్వమన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి సమ్మెలు చేయడం ఒక సాధనమన్నారు.