తెలంగాణ

ఇదేనా బంగారు తెలంగాణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: ప్రశాంతంగా ఛలో ట్యాంకుబండ్ నిర్వహించాలని ఆర్టీసీ కార్మికుల నేతలు, రాజకీయ పార్టీల నేతలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రయత్నిస్తే ప్రభుత్వం పోలీసులను వినియోగించి జులుం ప్రదర్శించిందని జాక్టో చైర్మన్ జీ సదానంద్ గౌడ్, సెక్రటరీ జనరల్ ఈ రఘునందన్, ట్రెజరర్ ఎం రాధాకృష్ణ, కో చైర్మన్లు సోమయ్య తదితరులతో పాటు టీపీటీఎఫ్ అధ్యక్షుడు వై అశోక్ కుమార్ ప్రధాన కార్యదర్శి మైన శ్రీనివాస్, ఇతర నేతలు ఎం రవీందర్, బీ రాంబాబు మండిపడ్డారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలను అమలుచేసినా మిలియన్‌మార్చ్ విజయవంతం అయ్యిందని అన్నారు. కార్మికులను ట్యాంకుబండ్‌పైకి అనుమతించాలని పోలీసులను అడుగుతుంటే , పోలీసులు మాత్రం లాఠీలతో కొడు తూ, కాళ్లతో తంతూ , బూతులు తిడుతూ చాలా అభ్యంతరకరంగా వ్యవహరించారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాటి నాయకులకు నేటి సీఎం ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆటవిక పాలనను పోలీసుల దౌర్జన్య కాండను ఉపాధ్యాయులు, తెలంగాణ సమాజం ఖండిస్తోందని చెప్పారు. పోలీసుల దౌర్జన్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
టీఎస్‌పీటీఏ నిరసన
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఛలో ట్యాంకుబండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్‌కుమార్, నాసర్ పటేల్ తదితరులపై అకారణంగా లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీఎస్‌పీటీఏ అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలి, ప్రధాన కార్యదర్శి ఎన్ చెన్న రాములు పేర్కొన్నారు. ఇది పౌరుల హక్కులను కాలరాయడమేనని, దానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. నియంతృత్వంలో కూడా ఇలాంటి ఘటనలు ఉండవని, దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు కూడా ఈ విధంగా చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.