తెలంగాణ

‘చలో ట్యాంక్‌బండ్’తో కేసీఆర్ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో భాగంగా రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాల జాక్ ఇచ్చి న పిలుపుమేరకు శనివారం నిర్వహించిన చలో ట్యాంకుబండ్‌లో పాల్గొనకుండా వామపక్ష, బీజేపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరును ప్రశ్నించిన నేతలను అరెస్టు చేశారు. పోలీసుల నిర్బంధాన్ని సైతం లెక్కచేయకుండా ట్యాంకుబండ్‌కు చేరుకున్న నేతలను అరెస్టు చేసి గోషామహల్‌కు తరలించారు. చలో ట్యాంకుబండ్‌లో పాల్గొంటారని అనుమానించిన నేతలు అందర్నీ ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు కొంత మందిని గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఛలో ట్యాంకుబండ్‌తో కేసీఆర్ పతనం మొదలైందని పేర్కొన్నారు.
బీజేపీ నేతల గృహ నిర్బంధం
శనివారం ఉదయమే పోలీసులు బీజేపీ కార్యాలయానికి చేరుకుని అక్కడున్న నేతలను అడ్డుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేయగా, పొంగులేటి సుధాకర్‌రెడ్డిని నార్సింగి పోలీసులు గృహనిర్బంధం చేశారు. జితేందర్‌రెడ్డిని ఇత ర నేతలనూ ఎక్కడికీ వెళ్లకుండా అడ్డుకున్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిని బంజారాహిల్స్ పోలీసులు గృహనిర్బంధం చేశారు. నగర మాజీ డిప్యుటీ మే యర్ సుభాష్ చందర్‌నూ పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తదితర నేతలు ట్యాంకుబండ్‌వైపు వెళ్లే ప్రయత్నం చేయగా వారినీ పోలీసులు అరెస్టు చేశారు.
గొంతు నొక్కుతున్న సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష గొంతుకను నొక్కుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పే ర్కొన్నారు. ప్రతిపక్షనేత లక్ష్మణ్‌ను గృహనిర్బంధం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ రా ష్ట్రాన్ని పోలీసు రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని అన్నారు. లక్ష్మణ్ తదితరులు కార్మికుల చలో ట్యాంకుబండ్‌లో పాల్గొనాల్సి ఉందని వెంటనే లక్ష్మణ్‌ను గృహనిర్బంధం నుండి విడిచిపెట్టాలని కోరారు. ప్రశాంతంగా ఛలో ట్యాంకుబండ్ నిర్వహించాలని చూస్తే కేసీఆర్ ప్రభుత్వం అణచివేత కార్యక్రమాలను నిర్వహిస్తోందని, పోలీసులను ఉసిగొల్పుతోందని కృష్ణసాగరరావు మండిపడ్డారు. గృహనిర్బంధం, అవసరానికి మించి పోలీసులను వినియోగించడం ద్వారా భయబ్రాంతులకు గురిచేయాలని ప్రభుత్వం చేస్తోందని, ప్రభుత్వ ఆగడాలు సాగవని అన్నారు. అక్రమ నిర్బంధాలకు ఎందుకు పాల్పడుతోందో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు జవాబుచెప్పాలని ఆయన నిలదీశారు.
అరెస్టులు దారుణం: చాడ
ఆర్టీసీ జాక్ ఇచ్చిన పిలుపు మేరకు చలో ట్యాంక్‌బండ్ నిర్వహించకుండా ఎక్కడికక్కడ పోలీసుల బలగాలను వినియోగించడం, రాష్టవ్య్రాప్తంగా వేలాది మందిని అరెస్టు చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. అనేక మంది రాజకీయ పార్టీల నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేయడం అన్యాయమని అన్నారు. హైకోర్టు సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని, చర్చలకు ఆహ్వానించకుండా సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమాన్ని అణచివేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు. కోర్టు సలహాలపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా మరో ప్రకటనలో ఛలో ట్యాంకు బండ్ విజయవంతం చేసిన నేతలను సీపీఐ ఎంఎల్ న్యూ డెముక్రసీ కార్యదర్శి డీవీ కృష్ణ, సంయుక్తకార్యదర్శి పోటు రంగారావులు అభినందించారు. చలో ట్యాంకుబండ్‌ను విచ్ఛిన్నం చేయడానికి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, పార్టీల కార్యకర్తలను వేలాది మందిని ముందుగానే అరెస్టు చేసి ప్రజాస్వామిక హక్కులను కాలరాసిందని అన్నారు. ఆర్టీసీ కార్మికులపై లాఠీచార్జీకి వ్యతిరేకంగా రాష్టవ్య్రాప్త నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చినట్టు ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు టీ నరసింహన్ పేర్కొన్నారు. అనేక మంది నేతలను పోలీసులు అరెస్టు చేశారని, వారందరినీ వెంటనే విడుదల చేయాలని అన్నారు.