రాష్ట్రీయం

ఇక చర్చల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: గత 37 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించే అవకాశం ఉంది. హైకోర్టు ఏమి చెబుతుందో వేచిచూశాకే తదుపరి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 7వ తేదీన ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో జరిగిన విచారణను 11కు వాయిదా వేస్తూ ఆలోగా మరోసారి కార్మికులతో చర్చలు జరపాల్సిందిగా ఆదేశించింది. అయినప్పటికీ కార్మికులతో ఎలాంటి చర్చలు జరపలేదు. ఈ విషయాన్ని సోమవారం హైకోర్టు ప్రస్తావిస్తే, ఇప్పటికే చర్చలకు పిలిస్తే కార్మిక సంఘాలు చర్చించకుండానే వెళ్లిపోవడాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ఎన్నిమార్లు స్పష్టం చేసినా ఆ డిమాండ్‌ను కార్మిక సంఘాలు వదులుకోకపోవడంతో చర్చలకు పిలవలేదని హైకోర్టుకు చెప్పాలని యాజమాన్యం నిర్ణయించినట్టు తెలిసింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ తీర్చాలంటే అది నగదుతో ముడిపడిన అంశమని, ఇప్పటికే చెల్లించాల్సిన దానికంటే ఎక్కువే చెల్లించడంతో ఇక ఎలాంటి చెల్లింపులు ఉండవని కూడా హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సమ్మె విరమించి విధుల్లో చేరడానికి కార్మికులకు ఎన్నిమార్లు అవకాశం కల్పించినా వినిపించుకోకపోవడంతో ఇక ప్రభుత్వం తరఫున చేసేదేమీ లేదని తేల్చిచెప్పాలని
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్టు అధికార వర్గాల సమాచారం. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు పదే పదే ప్రస్తావిస్తుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, దానికి హైకోర్టు బ్రేక్ వేయడంతో ఇక తాము చేసేదేమీ లేదని కోర్టుకు స్పష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వపరంగా హైకోర్టుకు చెప్పాల్సింది చెప్పాక కూడా ప్రతికూలంగా ఆదేశాలు జారీ చేస్తే పై కోర్టుకు వెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తునట్టు సమాచారం.