తెలంగాణ

లంచాలు తీసుకుంటూ కూడా అన్యాయం చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, నవంబర్ 11: ‘ప్రతి పనికి లంచాలు తీసుకుంటున్నారు.. అలాగని మాకు న్యాయం చేస్తున్నారా అంటే అదీ లేదు.. లంచాలు మింగి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు.. ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారు’ అంటూ రెవెన్యూ ఉద్యోగుల వైఖరిపై రైతులు తీవ్రస్థాయలో ధ్వజమెత్తారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ ఉద్యోగులకు, రైతులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురిని అక్కడి నుంచి పంపించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. భూ సమస్యల పరిష్కార విషయంలో రెవెన్యూ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ సమస్యలు పరిష్కరించడం లేదని గట్టు మండలం మాచర్ల గ్రామానికి చెందిన రాముడు కలెక్టర్‌తో తమ గోడును వెల్లబోసుకున్నాడు. గ్తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనానికి నిరసనగా త ఐదు రోజులుగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అధికారులపై రైతు రాముడుతో పాటు దొర్నాల బొజ్జన్న మరికొంతమంది తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉద్యోగులు లక్షలాది రూపాయలు తీసుకుంటూ లంచావతారం ఎత్తుతున్నారని, లంచాలు తీసుకున్నా తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఇతరులకు న్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. రెవెన్యూ అధికారుల వేధింపులు, తప్పుడు విధానాలకు ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అప్పుడు ఎందుకు ఉద్యోగులు స్పందించరని రైతు రాముడు ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య ఒక్కసారి కలెక్టరేట్ ఆవరణ అంతా వాగ్వివాదాలతో నిండిపోయాయ. రెవెన్యూ ఉద్యోగులు మాట్లాడుతూ ఈ సందర్భంలో ఇలాంటి గొడవలకు దిగడం సరైంది కాదని, రెవెన్యూ కార్యాలయంలో ఏమైనా తప్పులు జరిగితే ఆర్డీవో, జేసీ కోర్టు లేదా సివిల్ కోర్టులకు వెళ్లి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని, రికార్డులో నమోదు చేసేందుకు ఆస్కారం లేని సందర్భంలో తాము ఎలా చేయాలని ఎదురు ప్రశ్నించారు. ఒకానొక సందర్భంలో రెవెన్యూ అధికారులు రైతులు రాములు, బొజ్జన్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని రెవెన్యూ ఉద్యోగులు, రైతులను కలెక్టరేట్ ప్రాంగణం నుంచి బయటకు పంపించారు.