తెలంగాణ

స్వాగతిస్తున్నాం: జేఏసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: ఆర్టీసీ సమ్మె అంశం పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు అభిప్రాయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా హైకోర్టు సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైకోర్టులో సమ్మెపై జరిగిన వాదనల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం
సుప్రీంకోర్టు మాజీ జడ్జీలతో కమిటీని వేస్తే చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పునకు కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యను మరింత జటిలం చేయకుండా మాజీ జడ్జీల కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కారించాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని, ఇందుకు అభిప్రాయం తెలపాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం మంచి పరిణామమని అన్నారు. ప్రభుత్వం కూడా కమిటీ వేసి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని హైకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు.

*చిత్రం... ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి