తెలంగాణ

షూటర్ ఇషాసింగ్‌కు క్రీడల మంత్రి ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: దోహాలో జరుగుతున్న 4వ ఆసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్ జూనియర్ విభాగంలో మూడు స్వర్ణ పతకాలు సాధించిన హైదరాబాద్ చెందిన ఇషా సింగ్‌ను రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. 10 మీటర్ల విభాగంలో వ్యక్తిగత, టీం, మిక్స్‌డ్ డబుల్స్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించి అంతర్జాతీయ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారన్నారు. భవిష్యత్‌లో మరెన్నో అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. గచ్చిబౌలిలోని షూటింగ్ రేంజ్‌ను అభివృద్ధి చేస్తామని, దేశం గర్వించదగ్గ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా క్రీడల శాఖ పనిచేస్తుందన్నారు.