తెలంగాణ

అయోమయంలో రెవెన్యూ ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: గ్రామస్థాయిలోని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ) మొదలుకుని డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ (రెవెన్యూ జేఏసీ) పేరుతో తెలంగాణలో రెండు జేఏసీలు పనిచేస్తుండటం, ఈ రెండింటిలో ఒకటి ఆందోళన కొనసాగిస్తామని, మరొకటి ఆందోళన ఉపసంహరించుకుని మంగళవారం నుండి విధులకు హాజరవుతామని ప్రకటించడమే ఈ అయోమయానికి కారణం. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయాస్ జేఏసీ తరఫున వంగ రవీందర్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు కె. చంద్రమోహన్ తదితరులు ఒక ప్రకటన చేస్తూ, తమ జేఏసీ ఆందోళన విరమించి మంగళవారం నుండే విధులకు హాజరవుతున్నామని ప్రకటించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో తాము చర్చలు జరిపామని, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలతో పాటు శాఖాపరంగా ఎదురౌతున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు కలిసి చర్చించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చినందువల్ల ఆందోళన తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నామని వెల్లడించారు. ఒక వేళ రెండు వారాల్లో తమ సమస్యలు పరిష్కారం కానిపక్షంలో రెండు వారాల తర్వాత ట్రెసా జేఏసీ మళ్లీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని ప్రకటించారు. ఇలా ఉండగా డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ (ఒక వర్గం) అధ్యక్షుడైన వి. లచ్చిరెడ్డి నేతృత్వంలోని రెవెన్యూ జేఏసి మరో ప్రకటన చేస్తూ నవంబర్ 13 నుండి నవంబర్ 30 వరకు ఆందోళనా కార్యక్రమాన్ని ఖరారు చేసి వెల్లడించారు. రెండు జేఏసీల్లో కూడా గ్రామ రెవెన్యూ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు, డిప్యూటీ తహశీల్దారులు, తహశీల్దారులు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్ల ప్రతినిధులు ఉన్నారు. ఒక జేఏసి ఆందోళన ఉపసంహరించుకున్నామని ప్రకటించగా, మరో జేఏసీ ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించి వెల్లడించడంతో తాము అయోమయానికి గురవుతున్నామని వివిధ ప్రాంతాల నుండి వివిధ క్యాటగిరీల రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో..
33 జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్లు, రెవెన్యూ మండలాలు, రెవెన్యూ గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంత మంది విధులకు హాజరవుతారో, ఎంత మంది సమ్మెలో పాల్గొంటారో బుధవారం వెల్లడవుతుంది. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నుండి ఈ ఉద్యోగులు విధులకు హాజరు కావలసి ఉన్నప్పటికీ, ఈ రోజు సెలవు కావడంతో బుధవారం పరిస్థితి ఏమిటో వెల్లడవుతుంది. సమ్మెలో ఎంత మంది పాల్గొంటారో స్పష్టమవుతుంది.