తెలంగాణ

లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం జరిగిన ప్రమాదంలో క్యాబిన్‌లో చిక్కుకున్న ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని. వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నట్లు కేర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుష్మ ప్రకటించారు. రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆమె హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. లోకోపైలట్ చంద్రశేఖర్ రెండు కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిందని, పక్కటెముకలు, మూత్రపిండం దెబ్బతిన్నాయని వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన శేఖర్, బేలేశ్వరమ్మ, రాజ్‌కుమార్, సాజిద్, మస్మద్ ఇబ్రహీంకు వైద్యం అందిస్తున్నామని, వీరి అరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఈ ప్రమాదంలో 18మంది గాయాలపాలయ్యారు. హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రధాన లైన్ నుంచి లూపులైన్ ద్వారా 4వ ప్లాట్‌ఫాం వైపువస్తుండగా ఎంఎంటీఎస్ ట్రైన్ కాచిగూడ నుంచి ఫలక్‌నుమా వెళ్తుండగా వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎంఎంటీఎస్ నుంచి ఆరు బోగీలు గాల్లోకి లేచి పట్టాలు తప్పాయి.
*చిత్రం...ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్