తెలంగాణ

రాష్ట్రానికి కేసీఆరే పెద్ద సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 12: సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, యువత, పేదవర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, చివరకు రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఓ సమస్యగా మారారని బీజేపీ రాష్ట్ర చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ జీపీపీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం ప్రకటించి ఆయన మాట్లాడారు. ఆర్టీసీకి చమురు సంస్థలు పెట్రోల్‌బంక్‌ల లైసెన్స్‌లు ఇవ్వగా, అప్పనంగా ఎలాంటి రుసుము లేకుండానే సొంత మనుషులకు సీఎం కేసీఆర్ 47 బంక్‌లను కట్టబెట్టారని ఆరోపించారు. అయితే చమురు సంస్థలు ఇచ్చిన లైసెన్స్‌లను దుర్వినియోగం చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా, హోం శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. పదవుల కోసం అమ్ముడుపోయే ఉద్యమం ఆర్టీసీ ఉద్యమం కాదని, ఆవేదనతో ఆత్మార్పణ చేసుకున్న కార్మికుల కుటుంబాల పాపం సర్కార్‌కు తగులుతుందని హెచ్చరించారు. ఆర్టీసీని కొల్లగొట్టి కార్మికులను వంచించేందుకే ప్రైవేటీకరణ అంశం సీఎంఓలో ఒకరు కుట్రలకు తెరలేపగా, ఈ ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొంటూ కార్మికుల మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళన కేసీఆర్ పతనానికి దారి తీస్తుండగా, ఇప్పటికైనా కార్మికులతో చర్చించి ఆందోళన విరమింపజేయాలని డిమాండ్ చేశారు. సొంత నియోజకవరమైన గజ్వేల్‌లోనే ఆర్టీసీ కార్మికులను మెప్పించలేని కేసీఆర్ మరి రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్న తీరు ఎంతమాత్రం సమంజసం కాదని, ఆర్టీసీ మంటల్లో కాలిపోకముందే దిగి వస్తే బాగుంటుందని హితవు పలికారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కార్మికుల మరణాలు దురదృష్టకరం కాగా, డ్యూటీలో చేరకుంటే డిస్మిస్ చేస్తామని హెచ్చరిస్తున్న కేసీఆర్ సచివాలయానికి వెళ్లని మిమ్మల్ని ఏమి చేయాలని నిలదీశారు. ఆర్టీసీ కార్మికులను పండగ పూట పస్తులుంచిన ఘనత దక్కించుకోగా, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు మాత్రం ఆగడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో బీజేపీ పాగా వేస్తుందన్న భయంతో సీఎంకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, రాష్ట్ర నేతలు ఆకుల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... ప్రజ్ఞాపూర్‌లోని జీపీపీ డిపో వద్ద మంగళవారం ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో మాట్లాడుతున్న బీజేపీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్..