తెలంగాణ

వ్యవసాయ కూలీగా ఆర్టీసీ కార్మికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముధోల్, నవంబర్ 13: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ దాదాపు 40 రోజుల అవుతున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండు నెలలుగా కార్మికులకు జీతాలు లేక కుటుంబ పోషణ భారమవుతోంది. నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముధోల్‌కు చెందిన భూమేష్ భైంసా డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో కుటుంబ పోషణ భారమై దిక్కుతోచక వ్యవసాయ కూలీగా మారాడు. వ్యవసాయ పనుల్లో భాగంగా సోయాబీన్ నూర్పిళ్ల పనులకు వెళ్తున్నాడు. రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదని అవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలి పనులకు వెళ్లి తమ జీవితాన్ని నెట్టుకొస్తున్నామని, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి అదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరాడు.
*చిత్రం... నూర్పిళ్ల పనుల్లో కండక్టర్ భూమేష్