తెలంగాణ

ఆర్టీసీ సమ్మెలో ‘అభినవ’ మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,నవంబర్ 13: న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు రోజుకో విధంగా వినూత్న రీతిలో నిరసనలు చేపడుతూ అందరి మద్దతును కూడగట్టుకుంటున్నారు. బుధవారం సమ్మె 40వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో అందోళనలు మిన్నంటగా ఆర్టీసీ కార్మికుల ర్యాలీలో ప్రముఖులను పోలిన వేషధారణలు ప్రజలను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ షేక్ అయూబ్ సాధారణంగా డ్రైవర్ సీటులో కూర్చోగానే ప్రయాణికులు కొద్దిసేపు కనురెప్పవాల్చకుండా ఆయన వంకే చూసి అచ్చం మోదీలాగా ఉన్నారని సంభ్రమాశ్చర్యానికి లోనవుతారు. అయితే 40వ రోజు సమ్మెలో భాగంగా సుందరయ్య భవనం వద్ద కార్మికుల శిబిరంలోకి మోదీ డ్రెస్ కోడ్‌తో సూటు ధరించి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అచ్చం ప్రధాని మోదీలా కనిపించే అయూబ్‌ను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటూ అతనితో సెల్ఫీ దిగుతూ సరదాపడ్డారు. ఆ కొద్దిసేపటికే అక్కడికి గాంధీ వేషధారణలో చేరుకున్న ఆర్టీసీ డ్రైవర్ ఎండీ నిరంజన్ సమ్మె శిబిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.