తెలంగాణ

‘విలీనానికి’ చెల్లుచీటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలకు మధ్య చర్చలకు గుదిబండగా మారిన ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను ఆర్టీసీ జేఏసీ వదులుకుంది. దీంతోనైనా తమను చర్చలకు పిలువాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ సమ్మె 41 రోజుకు చేరుకున్నప్పటికీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం ససేమిరా అంగీకరించని విషయం తెలిసిందే. చివరకు హైకోర్టుకు కూడా చర్చ లు జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన మెట్టుదిగలేదు. దీంతో ఆర్టీసీ సమ్మె ఇప్పట్లో పరిష్కారం అయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రధానమైన డిమాండ్‌ను వదులుకోవడమే మేలని గురువారం జరిగిన కార్మిక సంఘాల జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాకు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె భవితవ్యంపై ఎంప్లాయాస్ యూనియన్
కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులు అఖిల పక్ష రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌నే ప్రభుత్వం భూతద్దంలో చూపుతుందని, ఈ డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మేలని కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు సూచించాయి. దీంతో ఈ డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు అశ్వత్థామరెడ్డి మీడియాకు వెల్లడించారు. 41 రోజులుగా కొనసాగుతున్న సమ్మె కారణంగా 23 మంది కార్మికులు మరణించినట్టు ఆయన తెలిపారు. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో గ్రామాలలో బైక్ ర్యాలీలు, శనివారం డిపోల వద్ద బైక్ ర్యాలీలు, 17, 18న డిపోల ఎదుట సామూహిక దీక్షలు చేపడుతామని వివరించారు. ఈనెల 19న హైదరాబాద్-కోదాడ రహదారిపై సడక్ బంద్ నిర్వహించనున్నట్టు తెలిపారు. మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులతో కలిసి రెండు, మూడు రోజులలో గవర్నర్‌ను కలువనున్నట్టు ఆశ్వత్థామరెడ్డి తెలిపారు.

*చిత్రం... జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి