తెలంగాణ

దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: దేశ ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టొద్దని , చిల్ల రాజకీయాలు చేయవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ గురువారం నాడు హితవుపలికారు. ఆదివాసీ నేతలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరిన సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవ విరుద్ధమని తేలిపోయిందని లక్ష్మణ్ అన్నారు. రాహుల్ గాంధీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. కోర్టులను, ప్రధానిని ఎలాంటి ఆధారాలు లేకుండా నిందించడం రాహుల్‌గాంధీ మానుకోవాలని అన్నారు. రాహుల్ గాంధీ కాలుకు బలపం కట్టుకుని తిరిగినా ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ అంశాన్ని, రామమందిరం అంశాన్ని బూచిగా చూపించి వాటిని కదిలిస్తే దేశంలో అల్లకల్లోలం జరుగుతుందన్నట్టు పబ్బం గడుపుకున్నారని అన్నారు. ప్రధాని మోదీ చొరవతో 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి వాటిని పరిష్కరించారని అన్నారు. రోజురోజుకూ ప్రధాని మోదీ గ్రాఫ్ పెరుగుతోందని, తెలంగాణలో సీఎం గ్రాఫ్ పడిపోతోందని అన్నారు. పోలీసు స్టేషన్లలో ఉండాల్సిన పోలీసులు రోడ్లమీదనే ఉంటున్నారని, తెలంగాణలో పాలన పూర్తిగా పడకేసిందని అన్నారు. విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని, చేసిన పనులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ ఆర్ధికాభివృద్ధి 21 శాతం ఉంటే అది 5 శాతానికి పడిపోయిందని అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ దివాలా దిశగా నడుస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీఆర్సీ ఇవ్వాలని అనిపిస్తే లీకులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే వెంటనే ఉద్యోగ సంఘాలతో సమావేశమై పీఆర్సీ ప్రకటించాలని అన్నారు.
కేంద్ర మంత్రి సారంగి రాక
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని, తెలంగాణకు మంచి భవిష్యత్ ఉందని కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన సారంగికి డాక్టర్ లక్ష్మణ్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సారంగి మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయని, అవినీతి పెరిగిపోతోందని, ప్రజలు బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం ఉండదని, ఇది దేశానికి మంచిది కాదని అన్నారు.
తెలంగాణలో బీజేపీ బలోపేతానికి మంచి అవకాశాలున్నాయని, ఇక్కడి నుండి నలుగురు ఎంపీలున్నారని చెప్పారు.

*చిత్రం... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్