తెలంగాణ

మాదకద్రవ్యాలు అనర్థదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మాదక ద్రవ్యాల సేవనం హాబీగా ఏర్పడి కాల క్రమేణా అలవాటుగా మారి శరీరానికి, వ్యక్తికీ కుటుంబానికి మొత్తం సమాజానికి ఇబ్బందులను గురిచేస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. మొదట్లో మాదక ద్రవ్యాల సేవనం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందని, సుదీర్ఘకాలం సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో ముప్పు తెస్తుందని అన్నారు. ఇలాంటి అనర్థాలను ముందే గుర్తించి యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. శనివారం నాడు సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌లో సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ అవేర్‌నెస్ శిబిరానికి ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుని జీవితానికి ఒక పరమార్థం ఉంటుందని, దానిని చేరుకునేందుకు దైవసంకల్పంతో పాటు స్వీయ కృషి కూడా చాలా అవసరమని అన్నారు. మాదక ద్రవ్యాల సేవనం కుటుంబ ఆనందానికి అవరోధంగా మారుతుందని చెప్పారు. హైకోర్టు జడ్జి ఎంఎస్ రామచంద్రరావుమాట్లాడుతూ న్యాయ సేవాధికారత సంస్థ వారి ముఖ్య లక్ష్యం సమాజంలో ఉన్న పేద,బడుగు వర్గాలకు ఉచిత న్యాయ సేవ అందింటంతో పాటు వారికున్న హక్కులపై అవగాహన కల్పించటమేనని వివరించారు. మాదకద్రవ్యాలను సేవించటం వల్ల దేశ ఆరోగ్య, ఆర్థిక స్థితిగతులపై ఫ్రభావం ఉంటుందని అన్నారు. సగటున తొమ్మిది నుంచి పది సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న వారు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, దాన్ని అరికట్టేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని తిరిగి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందకు వైద్య సౌకర్యాలతో పాటు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయనత తెలిపారు. వాటి మధ్య సమన్వయం మెరుగుపడాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. సమాజంలో వస్తున్న పెను మార్పులను దృష్టిలో పెట్టుకుని న్యాయ సేవాధికారి సంస్థ పలు కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని తెలిపారు. న్యాయసేవాధికారత సంస్థ ప్రత్యేక యూనిట్లను అభివృద్ధి చేసి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

*చిత్రం... డ్రగ్స్ నిర్మూలన, అవగాహనపై శనివారం నిర్వహించిన శిబిరంలో మాట్లాడుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్ చౌహాన్