తెలంగాణ

జడ్పీ సీఈఓలకు ఆర్థికాధికారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈఓలకు డ్రాయింగ్, డిస్బర్సింగ్ అధికారాలను కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీపీ సీఈఓలపై పనివత్తిడి అధికంగా ఉండటంతో డిప్యూటీ సీఈఓలకు ఈ అధికారం ఇచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు జడ్పీపీలకు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాల్లోని ఉన్నతపాఠశాలల నిర్వహణ, రోడ్లు వేయడం తదితర అనేక పనులు జడ్పీపీ పరిధిలో ఉంటాయి. జిల్లా అభివృద్ధి ప్రణాళికలో జడ్పీపీలు కీలక భూమిక పోషిస్తాయి. గతంలో జిల్లాపరిషత్ చైర్మన్‌లు విస్తృతమైన అధికారాలను కలిగి ఉండేవారు. 73 వ రాజ్యాంగం సవరణ ప్రకారం కూడా జడ్పీపీలకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జడ్పీపీ సీఈఓలపై పనిభారం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఈ భారాన్ని కొంతవరకైనా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.