తెలంగాణ

నేడైనా తేలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెపై సోమవారం హైకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సమ్మెపై ఇటు జేఏసీ నేతలకు, అటు ప్రభుత్వానికి హైకోర్టు ఇప్పటికే అనేక సూచనలు చేసింది. అయినా ఎవరి వాదనలు వారివే కావడంతో దాదాపు 45 రోజులు సమ్మె నిరాఘాటంగా కొనసాగుతోంది. ఈ సమ్మె తెలంగాణలో చారిత్రాత్మకం అంటూ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ కోసం సకల జనుల సమ్మె 41 రోజులు సాగితే, ఇపుడు ఇదే ప్రత్యేక రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె 45 రోజులకు చేరుకుందని జేఏసీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ సమ్మెపై సోమవారం హైకోర్టు సూచించే నిర్ణయం ఏమిటోనని సీనియర్ అధికారుల్లో ఆందోళన నెలకొంది. పలువురు అధికారులు ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్‌లపై హైకోర్టు చీవాట్లు పెట్టిన అంశాలను వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇటు ప్రభుత్వం, అటు హైకోర్టులో వాదప్రతివాదనల మధ్య సమ్మెకు పరిష్కారం దొరుకుందన్న ఆశాభావం కార్మికుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా మూడు అంశాలపై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. జేఏసీ నేతల అఫిడవిట్, సమ్మె చట్టవిరుద్ధం అన్న అంశం, కొత్త రూట్ల కోసం రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన నిర్ణయంపై హైకోర్టులో చర్చకు వచ్చే అంశాలు ఉన్నాయి. మరోపక్క ఆర్టీసీ జేఏసీ నేతలు తమ ప్రధాన డిమాండ్ అయిన ప్రభుత్వంలో విలీనం అంశాన్ని పక్కన పెట్టామని ఇప్పటికే ప్రకటించారు. మిగిలిన అంశాలపై ప్రభుత్వం
చర్చలకు పిలిస్తే తాము సిద్ధమేనంటూ జేఏసీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదిలావుండగా, కార్మికుల సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని, అందుకు మీ అభిప్రాయం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరిన విషయం తెలిసిందే. హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న ముగ్గురు సభ్యులు గల విశ్రాంత న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటు ఆవశ్యకతపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సీనియర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, ఆర్టీసీ జేఏసీ నేతలు చేపట్టిన సమ్మె చట్టవిరుద్ధమని ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు, అటు రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయాల కోసం వేచి చూస్తున్నారు.