తెలంగాణ

కెమికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూలై 16: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మం డలం దండుమల్కాపురం శివారులోని జయ లేబోరేటరీస్ కెమికల్ పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో సుమారు మూడున్నర కోట్ల రూపాయల విలువ చేసే 33 టన్నుల ము డిసామాగ్రి దగ్ధమైంది. స్టోర్ రూమ్‌లో ప్రమాదవశాత్తు మంటలు ఏర్పడి క్రమంగా వ్యాపించి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో స్టోర్ రూమ్‌లో ఉన్న ముడిసామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. పక్కనే ఉన్న డిసిఎం, డ్రమ్ములకు సైతం మంటలు అంటుకొని దగ్ధమయ్యాయి. పరిశ్రమలోకి మంటలు వ్యాపించాయి. షెడ్ పాక్షికంగా దగ్ధమైంది. యంత్రాలు సైతం దెబ్బతిన్నాయి. మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గమనించిన పరిశ్రమ సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పరిశ్రమలో మంటలు వ్యాపించకుండా ఆర్పివేశారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ సిఐ నవీన్‌కుమార్ సంఘటన ప్రాంతాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.