తెలంగాణ

వేతనాల పెంపుతోనే ఆర్థికమాంద్యానికి మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికుల వేతనాలు పెంచితే దేశంలో ఆర్థికమాంద్యం తగ్గుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పబ్లిక్‌క్లబ్‌లో నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ జిల్లా విద్యాసదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నేరవేర్చలేదని విమర్శించారు. ఆర్ధికమాంద్యం పేరుతో ఇచ్చిన హామీలను దాటవేయడం సరికాదన్నారు. ప్రభుత్వం కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్.రాములు, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవిలు మాట్లాడుతూ విద్యారంగంలో నాణ్యత పెరగాలంటే బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలన్నారు. అదేవిధంగా ప్రాధమిక విద్యలో సంస్కరణ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంకు సమాంతరంగా ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెడితే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యామాన్ని బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.