తెలంగాణ

మత్స్య సంపద పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, నవంబర్ 17: ఆంధ్రా ప్రాంతానికి ధీటుగా తెలంగాణలో మత్స్య సంపద పెరగాలి...మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం కూచన్‌పల్లి-ముత్తాయిపల్లి శివారులో మంజీర నదిపై నూతనంగా నిర్మించిన చెక్‌డ్యాంలో 2.16 లక్షల చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 గ్రామాలకు ఉపయోగపడేలా చెక్‌డ్యాం నిర్మించడం జరిగిందన్నారు. 2014 తర్వాత కుల వృత్తులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. హల్దీ, మంజీరా నదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాంల వల్ల అన్ని వర్గాల వారికి మేలు చేకూరుతుందన్నారు. మార్కెట్ సౌకర్యం, వాహనాలు సబ్సిడీపై ఇవ్వడం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెర్వులు, కుంటలు నిండుతాయన్నారు. దీంతో మత్స్య అభివృద్ది జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతులకు భీమా, ధీమా కల్పించడంతో ఐక్యరాజ్యసమితి అభినందించిందన్నారు. మంజీరపై నిర్మిస్తున్న 14 చెక్‌డ్యాంల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఘన్‌పూర్ ఆనకట్ట పెంపుతో సాగు పెరుగుతుందన్నారు. సింగూరును నింపే యత్నాలు జరుగుతున్నాయన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. కుల వృత్తుల వారు తమకందుతున్న సహాయంతో ఆర్థికంగా ఎదగాలన్నారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 519 చెర్వులలో 2.8 కోట్ల చేప పిల్లలు విడుదల చేసినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు లావణ్యారెడ్డి, ఎంపిపి అధ్యక్షులు శేరి నారాయణరెడ్డి, సర్పంచ్ దేవాగౌడ్, ఉప సర్పంచ్ బయ్యన్న, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.