తెలంగాణ

కార్మికుల జీవితాలతో సర్కారు చెలగాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, నవంబర్ 17: ఆర్టీసీ కార్మికులు గత 45రోజుల నుండి తమ డిమాండ్ల సాధన కోసం పోరాటాలు చేస్తున్న కేసీ ఆర్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నిరెత్తిన్నట్లుగా వ్యవహిరిస్తూ వారి కుటుంబాలతో చలగాటం ఆడుతుందని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పస్నూరు గ్రామంలో కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ పీ.గోవర్ధన్‌రెడ్డి దశదిన కర్మకు హాజరై అతని భార్య సర్పంచ్ పీ.దివ్యను కలిసి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల, విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నక్కలగండి ప్రాజెక్టుకు నిధులు కేటాయించక పోవడం వలన నత్త నడకగా పనులు కొనసాగుతున్నాయని ఆ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్ల రూపాయలు కేటాయించి వేగవంతంగా పూర్తి చేశారన్నారు. అలాగే బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్టు 50కోట్లు కేటాయిస్తే మిగితా పనులు పూర్తవుతాయని తెలిపారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ కోమటిరెడ్డి