తెలంగాణ

కదులుతున్న రైలు నుంచి దూకిన ఐఐఐటీ విద్యార్థులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, నవంబర్ 17: ఒక రైలు ఎక్కబోయ మరొకటి ఎక్కిన విద్యార్థులు కదులుతున్న రైలు నుంచి కిందకు దూకడంతో గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఎన్‌పీటీఈఎల్ పరీక్ష రాసేందుకు బాసర రైల్వేస్టేషన్ నుండి నిజామాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. అయతే వీరు అజంతా ఎక్‌స్రపెస్ ఎక్కబోయ పొరపాటున పర్బనీ పాసింజర్‌ను ఎక్కారు. అయతే అసలు విషయం తెలిసేసరికి రైలు కదిలిపోయంది. దీంతో కంగారుగా అందులోంచి కిందకు దూకేయడంతో వరంగల్ జిల్లాకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థి సాయికుమార్ తలకు తీవ్ర గాయాలు కాగా మరో విద్యార్థికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో రైల్వే పోలీసులు ఐఐఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అంబులెన్స్‌లో సాయికుమార్, మరో విద్యార్థిని ఐఐఐటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోటీ పరీక్షల నిమిత్తం సుమారు 100 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి యూనివర్సిటీ నుండి వెళ్తున్న క్రమంలో యూనివర్సిటీకి చెందిన అధికారి ఒకరూ కూడా లేకుండా విద్యార్థులు పర్యవేక్షణ గాలికి వదిలేసినట్టు తెలుస్తోంది. యూనివర్సిటీ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 106 మంది విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్తే యూనివర్సిటీ నుండి ఒక్క అధ్యాపకుడు కూడా లేకపోవడం యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. పరీక్ష తొందరలో పడి ప్రాణాలపైకి తెచ్చుకున్న విద్యార్థులకు యాజమాన్యం అలసత్వం వల్లే ఇలా జరిగిందని కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
*చిత్రం... ప్రమాదంలో గాయపడిన ఐఐఐటీ విద్యార్థి