తెలంగాణ

ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఆదివారం మహాదీక్షను చేపట్టేందుకు ప్రయత్నించిన సబ్బండ వర్గాల నేతలను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, పేదలు కలిసి ఇక్కడి ఇందిరాపార్క్ వద్ద ఆదివారం మహాధీక్ష చేసేందుకు ప్రభుత్వం అనుమతి కోరామని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ తదితరులు గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల్లో సబ్బండ వర్గాల వారే ఎక్కువగా ఉన్నారని వారికి న్యాయం చేకూర్చాలన్నదే తమ లక్ష్యమన్నారు. అందుకే మహాధీక్ష తలపెట్టామన్నారు. ప్రభుత్వ అనుమతి కోసం ముందుగానే దరఖాస్తు చేసినప్పటికీ, శనివారం సాయంత్రం వరకు కూడా గమ్మున ఉన్న పోలీసులు ఆ తర్వాత అనుమతి ఇవ్వడం లేదని ప్రకటించారని ఆరోపించారు. తాము కోర్టు ద్వారా అనుమతి తీసుకునేందుకు కూడా పోలీసులు అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తే నష్టపోయేది సబ్బండవర్గాలేనని సురేష్ తదితరులు పేర్కొన్నారు. ప్రైవేట్‌పరం చేయడం వల్ల ఈ వర్గాల ప్రజల ఉద్యోగాలకు విఘాతం కలుగుతుందన్నారు. విద్యార్థులతో పాటు సమాజంలో అర్హత కలిగిన వారందరి పాస్‌లు రద్దవుతాయన్నారు.