తెలంగాణ

గేమింగ్ హబ్‌గా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: ఐటీ, ఫార్మా రంగాలకే కాకుండా గేమింగ్ టెక్నాలజీకి కూడా హైదరాబాద్ నగరం హబ్‌గా మారుతుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇక్కడికి వస్తున్న గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి కూడా రాయితీలు ప్రకటించబోతున్నామని అన్నారు. హెచ్‌ఐసీసీలో బుధవారం ‘ఇండియా జాయ్-2019’ వేడుకను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ మాట్లాడుతూ, ప్రపంచస్థాయి స్టూడియోలు హైదరాబాద్‌లో వెలిశాయని, దీంతో చిత్ర పరిశ్రమకు ఇక్కడ చక్కని వేదికగా మారిందన్నారు. వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగంలో ఇక్కడ కోట్లాది రూపాయాల వ్యాపారం జరుగుతున్నదని అన్నారు. యానిమేషన్ వచ్చాక చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కిందని, సినిమా నిర్మాణంలో వీఎఫ్‌ఎక్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ‘బాహుబలి’ ‘ఈగ’ ‘మగధీర’ వంటి తెలుగు సినిమాలు దేశ సినిమా రంగానే్న ఎంతగానో ప్రభావితం చేశాయని మంత్రి గుర్తు చేశారు. గేమింగ్ అండ్ ఎంటర్‌టెన్‌మెంట్ రంగం నుంచి ప్రస్తుతం రూ.250 కోట్ల ఆదాయం ఉండగా ఇది వచ్చే ఏడాది నాటికి మూడు రెట్లు పెరుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో రూ.1000 కోట్ల వ్యయంతో ఇమేజ్ టవర్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మరో రెండేళ్లలో ఇమేజ్ టవర్స్ నిర్మాణం ప్రారంభం అవుతుందని అన్నారు. ఇండియా జాయ్ ద్వారా గేమింగ్ అండ్ మీడియా రంగాన్ని విస్తృతం చేస్తామని, మున్ముందు ఈ రంగానికి హైదరాబాద్ హబ్‌గా మారబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు సినీరంగం నుంచి అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి నమ్రత తదితరులు పాల్గొనగా, ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు జరుగనుంది.
*చిత్రం... హైటెక్ సిటీలో గేమింగ్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ‘ఇండియా జాయ్’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్