తెలంగాణ

కోటి ఎకరాల మాగాణి సర్కారు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 20: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా లోని కొండారెడ్డిపల్లి, కోనేటిపురం గ్రామాలలో మంత్రి శ్రీనివాస్‌యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా కోనేటిపురం గ్రామంలోని పెద్ద చెరువులో లక్ష చేపపిల్లలను మంత్రి శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు వదిలారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కోనేటిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని అందుకే రైతులు పెట్టుబడులకు ఇబ్బందులు పడకుండా ఉంటేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయం పండుగలా మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని అందులో నాంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కేసీఆర్ చరిత్ర సృష్టించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాలకు గోదావరి జలాలు అందుతున్నాయని దాంతో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు అతిపెద్ద భారీ సాగునీటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి అని ఈ ప్రాజెక్టును పూర్తి చేసి దాదాపు 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అన్నింటినీ అధిగమిస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని వెల్లడించారు. కొందరు దుర్మార్గులు రైతుల పొట్టగొట్టడానికి చూస్తున్నారని వారి ఎత్తులను చిత్తు చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతి సెంటు భూమికి కృష్ణాజలాలు అందించి తీరుతామని అన్నారు. రాష్ట్రంలో మత్సకార్మికుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉచితంగా లక్షలాది చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నామని అన్నారు. చేపలు పెంపకంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిలో నిలుస్తుందని అందుకు అడుగులు పడ్డాయని అన్నారు. తెలంగాణలో పెంచిన చేపలు ఇతర రాష్ట్రాలకు సైతం సరఫరా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేడి లక్ష్మారెడ్డి, జడ్పీ చైర్‌ర్సన్ పద్మావతి, వైస్ చైర్మన్ బాలాజీసింగ్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... నాగర్‌కర్నూల్ జిల్లా కోనేటిపురం చెరువులో చేపపిల్లలను వదులుతున్న మంత్రి శ్రీనివాస్‌యాదవ్