తెలంగాణ

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 20: మంచిగా పాలిస్తాడనే ఉద్దేశంతో ప్రజలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే దానిని పట్టించుకోకుండా అధికార అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ గెలిపించిన ప్రజలను పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ సీఏం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మాయమాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో రెండోసారి అధికారం అప్పగిస్తే ఆయనలో అహంకారం పెరిగి ఓట్లు వేసిన ప్రజలను పట్టించుకోకుండా ఫాంహౌస్‌కు, ప్రగతి భవనంకు పరిమితమై రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తూ రాజ్యాంగ సంస్థలను అగౌరవపరుస్తున్నాడని, కేసీఆర్ వ్యవహరశైలితో ప్రజలు విసిగివేసారిపోయారని అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలబిస్త్తూ ప్రగతి భవన్‌కే పరిమితమైన కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పాలన సంక్షోభంలో ఉందని, ఆదిలాబాద్ ప్రాంతంలో గిరిజనులు విషజ్వరాలతో, రాష్టవ్య్రాప్తంగా పారిశుద్ధ్యం లోపించడంతో డెంగ్యువాధులతో ప్రజలు అల్లాడి పోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తుండగా, ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌కు పాలేర్లుగా, ఫాంహౌస్‌కు బానిసలుగా ఉంటున్నారని ఆరోపించారు. దేశంలో ప్రధాని మోదీ తన పరిపాలనతో గ్రాఫ్ పెరిగిపోతుండగా, రాష్ట్రంలో సీఏం కేసీఆర్ తన వ్యవహారంతో గ్రాఫ్‌పడిపోతున్నదని అన్నారు. ప్రధాని మోదీ ప్రతిష్ట నింగికి ఎక్కుతుండగా, సీఏం కేసీఆర్ ప్రతిష్ట పాతాళానికి పోతున్నదని అన్నారు.
ప్రతిపక్షాలతో కుమ్మక్కై ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఒక ఐఏఎస్ అధికారితో కోర్టులోనే తప్పుడు నివేదికలను ఇప్పించారంటే కేసీఆర్ ఎంత నీచస్థాయికి దిగజారుడో అవగతమవుతున్నదని, ప్రభుత్వాన్ని కూల్చివేసే అవసరం బీజేపీకి లేదని, రాబోయే రోజులలో ప్రజలే కూల్చివేసి ప్రజలకు మేలుచేసే ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారని అన్నారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.లక్ష్మణ్