తెలంగాణ

రాయలగండి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్రాబాద్, నవంబర్ 20: నల్లమల ప్రాంతంలోని రాయలగండి శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధులకోసం తవ్వకాలు చేపట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి దళితులే పూజారులుగా ఉండటం విశేషం. ఈ ఆలయంలో గతంలో ఎన్నోమార్లు గుప్త నిధులకోసం తవ్వకాలు జరిపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా దేవాలయం గర్భగుడి ముందున్న ధ్వజస్తంభం దగ్గర నిర్మించిన దిమ్మెను గుర్తు తెలియని వ్యక్తులు తవ్విన తరువాత యధావిధిగా ఆ దిమ్మెను పెట్టి వెళ్లిపోయారు. అదేవిధంగా గర్భగుడి వెనుకభాగంలో కూడా తవ్వకాలు చేపట్టారు.
ఈ ఘటనపై రాయలగండి దేవాలయ కమిటి సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ఆలయ సమీపంలో కొన్ని ఆధునిక యంత్రాలతో వచ్చిన ఐదుగురిని ప్రజలు ముఖ్యంగా యువకులు వెంబడించి మన్ననూర్‌లో వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. కాని దీనిపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారిన సమయంలోనే ఈ దేవాలయంలో గుప్తనిధుల తవ్వకాలు జరపడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

*చిత్రం... రాయలగండి దేవాలయం ఆవరణలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసిన దృశ్యం