తెలంగాణ

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌడిపల్లి, నవంబర్ 20: గుండెపోటుతో మరో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్‌పూర్ గ్రామానికి చెందిన మెదక్ డిపో ఆర్టీసీ కండక్టర్ షేక్ జాఫర్ (33) గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొన్న కండక్టర్ షేక్ జాఫర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ నెల 13న ఇంటి వద్ద గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ కార్మికుల ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ ఆసుపత్రి వైద్యులు చికిత్సకు నిరాకరించారు. దీంతో హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చేర్పించారు. చిక్సిత పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతునికి భార్య మజిరిన్, కుమారుడు ఫరాన్(3), మదియ (2), తల్లి రజియా, చెల్లెలు ఆశ ఉన్నారు. కుటుంబ సభ్యులు షేక్ జాఫర్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. షేక్ జాఫర్ మృతిపట్ల మెదక్ డిపో ఆర్టీసీ జేఎసీ నాయకులు ఎంఆర్‌కె.రావు, శ్రీనివాస్‌రెడ్డి, సుభాష్‌చంద్రబోస్, మొగులయ్య, శాఖయ్య, పలువురు కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి కార్మికుల ప్రాణాలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

* కండక్టర్ షేక్ జాఫర్ (ఫైల్ ఫొటో)