తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీతో పాటు ఎఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీలు వేర్వేరు ప్రకటనల్లో ముఖ్యమంత్రిని కోరాయి. తెలంగాణ ఆర్టీసీ జాక్ బేషరతుగా విధులకు అనుమతించాలని చేసిన ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కరించాలని ఏపీ స్ట్ఫా వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర డిప్యుటీ జనరల్ సెక్రటరీ కట్టా సుబ్రహ్మణ్యం, కార్యదర్శి నంద్యాల రాజశేఖర్‌లు కోరారు. 48 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం అశువులు బాసితే , నేడు ఆర్టీసీ పరిరక్షణ కోసం జరుగుతున్న సమ్మెలో కార్మికులు బలి అవుతున్నారని అన్నారు. బంగారు తెలంగాణలో కార్మికులు బాధలు అనుభవిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అగ్రభాగాన ఉందని అన్నారు. తెంలగాణ ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. కాగా 20 రోజుల క్రితం అస్వస్థతకు గురైన స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీ ఎస్ రావును దివాకరన్ తదితరులు పరామర్శించారు.
కార్మిక శాఖ కమిషనర్‌కు వినతి
ఆర్టీసీ సమ్మెపై జాయింట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్‌ను ఆరు జాతీయ కార్మిక సంఘాలు ఎఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీలకు చెందిన నేతలు కోరారు. 15 రోజుల్లో సమ్మె సమస్యను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించిందని, వెంటనే ఆర్టీసీ జాయింట్ సమావేశం నిర్వహించాలని వారు కోరారు. కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని, ఆర్టీసీ సంస్థలో పారిశ్రామిక ప్రశాంతతను నెలకోల్పాలని వారు విజ్ఞప్తి చేశారు.