తెలంగాణ

పోటాపోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మార్చే ప్రతిపాదనపై ఏఐసీసీ ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ, ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఉత్తమ్‌ను మార్చే పక్షంలో తమకు పీసీసీ అధ్యక్షపదవిని ఇవ్వాలని కోరుతూ పలువురు కీలక నేతలు అధిష్ఠానవర్గంపై ఒత్తిడి పెంచుకున్నారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని చతికిలపడిన కాంగ్రెస్‌లో ఇప్పుడు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత పార్టీ మారారు. అంతేగాక, పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం తగ్గింది. ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా కోల్పోయింది. ప్రస్తుతం సీఎల్‌పీ నేతగా భట్టి విక్రమార్క ఉన్నారు. కాగా, పీసీసీ రేసులో తాము ఉన్నట్లు ఇప్పటికే భువనగిరి ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కోమటిరెడ్డికే పదవిని ఇవ్వాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా నుంచి గాంధీభవన్ వరకూ కాంగ్రెస్ కార్యకర్తలు సంకల్పపాదయాత్ర చేయడం విశేషం. ఇక జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్షపదవిని అప్పగిస్తే, 2023లో పార్టీని అధికారంలోకి తెస్తానని ప్రకటించారు. ఆయన ఒకటిరెండురోజుల్లో ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలను కలుస్తానని కూడా ప్రకటించారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు అనేక మంది నేతలు తమ
ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, కొండా విశే్వశ్వరరెడ్డి, భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మహిళల కోటాలో సీనియర్ నేత, మాజీ మంత్రి జే. గీతారెడ్డి తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి రెండు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా, మరో నాలుగేళ్లపాటు వారినే కొనసాగించాలి. ఈ నేపథ్యంలో, పార్టీని వ్యవస్థాపరంగా బలోపేతం చేయగలిగే నేత కోసం ఏఐసీసీ ఆనే్వషిస్తోంది. అలాంటి నేతను గుర్తించే వరకు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మార్చే అవకాశం లేకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ సీటుకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన ఆయన భార్య పద్మావతిరెడ్డి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఓడినప్పటికీ 65వేల ఓట్లు రావడం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ వెంటనే ఉన్నారని, కానీ, వారిని చైతన్యవంతులను చేసే నేత కావాలని అంటున్నారు. ముందుగా ఆర్థిక వనరుల లేమితో పార్టీ సతమతమవుతోంది. ఎన్నికలు సమీప భవిష్యత్తులో లేనందున పార్టీ అధ్యక్షుడి మార్పు విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేసే అవకాశం కనపడుతోంది. ఎంత పెద్ద చురుకైన నేతను ఇప్పుడు నియమించినా చేసేదేమీ లేదని కొంత మంది సీనియర్ నేతలంటున్నారు. మరో వర్గం మాత్రం పీసీసీ చీఫ్‌ను మార్చాల్సిందేనని, కేసీఆర్ అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, పార్టీ జనంలోకి చొచ్చుకుపోయేందుకు ఇదే అనువైన సమయమని ఏఐసీసీ నేతలకు స్పష్టం చేస్తున్నది.
ఎన్నికలతో నిమిత్తంలేకుండా పార్టీ కేడర్‌ను ఉత్తేజపరిచి, ప్రజా ఉద్యమాలు నడిపేందుకు ఒక యువ నాయకుడు కావాలని పార్టీ వ్యవహారాలు చూసే ఇన్‌చార్జీ ఆర్‌సీ కుంతియాకు కొంత మంది నేతలు కలిసి పదే పదే కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే, పీసీసీ రేసులో ఇంతవరకు వినిపించని పేర్ల వివరాలను కూడా ఏఐసీసీ తెప్పించుకుని పరిశీలిస్తోందని సమాచారం. పార్టీని నడపడంలో మంచి వ్యూహకర్తలుగా పేరుతెచ్చుకున్న పీసీసీ మాజీ అధ్యక్షులు డీ. శ్రీనివాస్, కేకే, మాజీ మంత్రి డీకే అరుణలు పార్టీని వీడారు. డీఎస్, కేకే టీఆర్‌ఎస్‌లో చేరగారు. అనేకానేక వార్తలు, ఉత్కంఠ పరిణామాల తర్వాత, డీఎస్ ఆ పార్టీలో సైలెంటయ్యారు. డీకే అరుణ బీజేపీలో చేరి ఆ పార్టీ అధ్యక్షపదవికోసం పోటీపడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి మంచి అవకాశాలు ఉన్నా, ఇటీవల కాలంలో అనేక వివాదస్పద ప్రకటనలు చేసి పార్టీకి దూరమయ్యారని కొందరు నేతలు చెప్పారు. రాష్ట్రంలో 34 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలు లేరు. మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, వీటిని సీరియస్‌గా తీసుకుని పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు, పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కొత్త పీసీసీ నేత కావాలని డిమాండ్ వినిపిస్తున్నది. అదే విధంగా, ఎటువంటి ప్రభావాలకు లోనుకాకుండా కాంగ్రెస్‌ను మొదటి నుంచి అంటిపెట్టుకుని ఉంటున్న నేతలంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోయినప్పటికీ, పీసీసీ చీఫ్ మార్పు, కొత్త అధ్యక్షుడి నియామకంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. నేతలు పోటీ పడుతున్నారు.