తెలంగాణ

అవసరాలకు అనుగుణంగా.. హెచ్‌ఎండీఏ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: జనాభా పెరుగుదల, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అనుగుణంగా హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) అభివృద్ధి ప్రణాళిక ఉండాలని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. హెచ్‌ఎండిఏ పరిధిలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అధికారులు, అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పచ్చదనం పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. హెచ్‌ఎండిఏ అభివృద్ధిపై వివిధ సలహాదారులు ప్రభుత్వానికి సమర్పించిన మాస్టర్ ప్లాన్లపై గురువారం తాత్కాలిక సచివాలయంలో ఆయన సమీక్ష జరిపారు. నగరంలోని ముఖ్యమైన సరస్సులైన హుస్సేన్‌సాగర్, గండిపేట చెరువుల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కన్సల్టెంట్లు మంత్రికి వివరించారు. జలాశయాల సహజత్వాన్ని కాపాడుతూ, నగర ప్రజలకు ఆహ్లదాన్ని పంచే విధంగా మాస్టర్ ప్లాన్ ఉండాలని వారికి మంత్రి సూచించారు. గండిపేట పార్కు అభివృద్ధి కోసం హెచ్‌ఎండిఏ తయారు చేసిన ప్రణాళికకు మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. త్వరలో పనులు ప్రారంభం కావాలని మంత్రి ఆదేశించారు. అలాగే గండిపేట జలాశయం చుట్టూరా సుమారు 40 కిలో మీటర్ల మైన వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. హెచ్‌ఎండిఏ అధికారులు నీటిపారుదలశాఖ అధికారులతో చర్చించి సమన్వయం చేసుకోవాలని సూచించారు. కోకాపేట అభివృద్ధి కోసం తయారు చేసిన లే అవుట్‌పై మంత్రి చర్చించారు. కోకాపేట, కొల్లూర్ ప్రాంతాల్లో జన సాంద్రత పెరగడం, పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వస్తున్న భవన సముదాయాలు, కార్యాలయాలకు అనుగుణంగా రవాణా, వౌళిక వసతులు కల్పించే అంశంపై కూడా మంత్రి చర్చించారు. ప్రైవేట్ సంస్థలతో కలిసి హెచ్‌ఎండిఏ పలు లాజిస్టిక్ పార్క్‌లను అభివృద్ధి చేస్తుందని, ఇవీ కచ్చితంగా పెరిగే జనాభాకు అనుగుణంగా కనీసం 50 ఎకరాలు ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. లాజిస్టిక్ పార్క్‌ల ఏర్పాటులో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. హెచ్‌ఎండిఏ నిర్మించ తలపెట్టిన హైదరాబాద్ హబిటాట్ సెంటర్ ప్రతిపాదనపై మంత్రి సమీక్షించారు. హైదరాబాద్ నగరంలోని కళలు,
సంస్కృతికి అద్దం పట్టేలా, మరింత ఊతం ఇచ్చేలా నివాస కేంద్రాలు ఉండాలని సూచించారు. హైటెక్స్, హెచ్‌ఐసీసీ మాదిరిగా నగరంలో ఇతర చోట్ల కూడా కనె్వన్షన్ సెంటర్ల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. ఉప్పల్, మేడ్చెల్ తదితర సిటీ పరిసర ప్రాంతాల్లో కనె్వన్షన్ సెంటర్లను నిర్మింప చేయాలని మంత్రి సూచించారు. కనె్వన్షన్ సెంటర్ల నిర్మాణంపై ఆయా ప్రాంతాలకు చెందిన జిల్లా యంత్రాంగంతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. హెచ్‌ఎండిఏ పరిధిని 20 విభాగాలుగా విభజించి ఆయా ప్రాంతాల్లో ఫారెస్ట్ బ్లాక్‌లు అభివృద్ధి చేయాలని చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్ ఇంటర్ ఛేంజ్ ప్రాంతాల్లో గ్రీనరీ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ తదితర ముఖ్యులు పాల్గొన్నారు.

*చిత్రం... సలహాదారుల మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష