తెలంగాణ

ఫలించిన కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: ఎంతోకాలంగా పాలమూరు రైతులు ఎదురు చూస్తున్న కల్వకుర్తి ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది. కల్వకుర్తి ఎత్తిపోతల 2, 3 ఫేజ్‌ల ట్రయల్ రన్‌ను సోమవారం నిర్వహించాలని నిర్ణయించారు. కృష్ణా జలాలు ఈ సీజన్‌లో పుష్కలంగా రానున్నందున ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు. కల్వకుర్తి డ్రై రన్, ట్రయల్ రన్ పనులను ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. జెన్‌కో చైర్మన్ ప్రభాకర్‌రావు, సిపిసిడిఎల్ డైరెక్టర్ రఘుమారెడ్డిలతో ఈ అంశంపై నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి ఆదివారం చర్చించారు. కల్వకుర్తి ఎత్తిపోతల ట్రయల్ రన్‌కు విద్యుత్ సరఫరా విషయమై సత్వరం చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. విద్యుత్ సరఫరాకు సిద్ధంగా ఉన్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. కల్వకుర్తి లిఫ్ట్ 2, 3, డ్రై రన్‌కు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి, ఈఎన్‌సి మురళీధర్‌రావు హాజరు కావాలని మంత్రి సూచించారు. మహబూబ్‌నగర్‌లో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్యాకేజీల వారీగా ప్రాజెక్టుల పనుల పురోగతిని మంత్రి ఆదివారం పరిశీలించారు. కాంట్రాక్టు ఏజెన్సీలు, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేల సమన్వయంతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇదివరకు ఇచ్చిన హామీ మేరకు ఆయకట్టుకు నీరు ఇవ్వకపోతే ఇఇ, డిఇఇలు బాధ్యత వహించాలని, వారిపై చర్యలు తప్పవన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి లక్షా 50వేల ఎకరాలకు, నెట్టెంపాడు నుంచి లక్షా 50 వేల ఎకరాలు, బీమా ద్వారా 1.40 లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ నుంచి 20 వేల ఎకరాలకు నీరు అందించనున్నట్టు చెప్పారు. లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన కృషి చేయాలని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ అంశాన్ని గ్రహించి పనులు సత్వరం పూర్తి చేయాలని సూచించారు.
chitram...
ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో
టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు