తెలంగాణ

ఎల్లంపల్లికి జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17:ఎల్లంపల్లి రిజర్వాయర్ పూర్తి సామర్థ్యంతో నిండనున్నది. దీంతో ముంపు బాధితులకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని వారం రోజుల్లో చెల్లించాలని నిర్ణయించారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యంతో నీరు నిండనున్నదని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎల్ 148 దగ్గర ముంపునకు గురయ్యే కుటుంబాలకు సహాయ పునరావాస శిబిరాలను వెంటనే ఏర్పాటు చేయాలని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల జాయింట్ కలెక్టర్లను హరీశ్‌రావు ఆదేశించారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యంతో నిండితే ఆదిలాబాద్ జిల్లాలో చందనాపూర్, రాపల్లి, కొండపల్లి, కర్న మామిడి, పడతాంపల్లి గ్రామాలకు చెందిన 283 కుటుంబాలకు ముంపు సమస్య వస్తుందని ఆ జిల్లా అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఉండేడ, చెగ్యామ్, ముక్కట్‌రావుపేట, కోటి లింగాల గ్రామాలకు చెందిన 217 కుటుంబాలకు ముంపు సమస్య ఉంటుంది. దీంతో మొత్తం 500 కుటుంబాలకు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా శిబిరాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. వంట గదులు, తాగునీరు మరుగుదొడ్లు, విద్యుత్ తదితర కనీస వసతులపై శ్రద్ధ చూపాలని చెప్పారు. ఆయా సహాయ శిబిరాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రాజెక్టులపై ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో పాటు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి, ఇఎన్‌సి మురళీధర్‌రావు, కరీంనగర్, మహబూబ్‌నగర్ సిఇలు అనీల్, ఖగేందర్‌రావు, ఓఎస్‌డి శ్రీ్ధర్‌రావు దేశ్ పాండే పాల్గొన్నారు.