తెలంగాణ

కాంట్రాక్టు కార్మికుల హక్కుల సాధనకు టిజెఎసి అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, జూలై 17: సింగరేణి కాంట్రా క్టు కార్మికులు వేతనాల కోసం చేస్తున్న డిమాండ్ న్యాయమైనదని, చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాల సాధనకు అండగా ఉంటామని టిజెఎసి చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఐఫ్‌టియూ సంయుక్త అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర సదస్సుకు ముఖ్యవక్తగా విచ్చేసిన కోదండరామ్ మాట్లాడుతూ కార్మకులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని అన్నారు. 1991లో వచ్చిన సరళీకరణ విధానంతో సింగరేణిలో ప్రైవేటీకరణను 1996 అమలు చేశారని తెలిపారు. కోల్ ట్రాన్స్‌పోర్ట్, మట్టి తొలగింపు, ఓవర్ నైట్ బడ్డన్ , కొన్ని కీలక పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారని పేర్కొన్నారు. సింగరేణిలో లక్ష 14వేల పర్మినెంట్ కార్మికులు ఉండగా ప్రస్తుతం 52వేల మంది ఉన్నారని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులు 30 వేల మంది ఉన్నారని, చిత్తశుద్ధితో అమలు కావాల్సిన హైపవర్ కమిటీ వేతనాలు, బోనస్ చెల్లిపులపై జెబిసిసిఐలో నిర్ణయం జరిగినప్పటికీ అమలు చేయకుండా యాజమాన్యాలు నిర్లక్షం చేస్తున్నాయని చెప్పారు.
సింగరేణి కాంట్రాక్టు కార్మిక ఉద్యోగులకు వేతనాలు, విద్యా, వైద్యం, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని లేదంటే కార్మికులు ఉద్యమిస్తారని తలిపారు. కార్యక్రమంలో ఎ.వెంకన్న,బి.ప్రదీప్, కె.సూర్యం, జె.సీతారామయ్య, బి.సంపత్ కుమార్ పాల్గొన్నారు.