తెలంగాణ

మార్చి 19 నుంచి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మంగళవారం విడుదల చేసింది. మార్చి 19వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటి వరకు పరీక్షలు జరుగుతాయని బోర్డు ఆఫ్ సెకండరీ డైరెక్టర్ పేర్కొన్నారు. పరీక్షల వేళలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. మార్చి 19న తెలుగు పేపర్-1, 20న తెలుగు పేపర్-2, 21న సెకండ్ ల్యాంగ్వేజ్, 23న ఇంగ్లీష్
పేపర్-1, 24న ఇంగ్లీష్ పేపర్-2, 26న గణితం పేపర్-1, 27న గణితం పేపర్-2, 28న జనరల్ సైన్స్ పేపర్-1, 30న జనరల్ సైన్స్ పేపర్-2, 31న సాంఘిక శాస్త్రం పేపర్-1. ఏప్రిల్ 1న సాంఘిక శాస్త్రం పేపర్-2, ఏప్రిల్ 3న సంస్కృత్ మరియు అరబిక్ పేపర్-1, ఏప్రిల్ 4న సంస్కృత్ మరియు అరబిక్ పేపర్-2, ఏప్రిల్ 6న ఓకేషనల్ కోర్స్ థియరీ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఫస్ట్ లాంగ్వేజ పేపర్-1 (కంపోజిట్), సంస్కృత్ అండ్ అరబిక్ పేపర్-1, పేపర్-2 పరీక్షలకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయని బోర్డ్ ఆఫ్ సెకండరీ డైరెక్టర్ పేర్కొన్నారు.