తెలంగాణ

నోరా? తాటిమట్టా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె సమయంలో బస్సు చార్జీలు పెంచి అయినా కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలన్న కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం మాట మార్చి చార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుల రెండు నాలుకల ధోరణికి పరాకాష్టకు ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ విప్‌లు విప్ కర్నె ప్రభాకర్, గువ్వల బాల్‌రాజు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీడియాతో మాట్లాడుతూ, పూటకో మాట మాట్లాడటం కాంగ్రెస్ నేతల నైజమన్నారు. వారిది నాలుకా? తాటి మట్టా? అని వారు మండిపడ్డారు. ఆర్టీసీ చార్జీలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలు అట్టర్ ప్లాప్ కావడంతో నవ్వుల పాలయ్యారని విమర్శించారు. గాంధీభవన్ వద్ద బస్ చార్జీల పెంపుదలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తే ప్రజల మాటేమో కానీ కనీసం ఆ పార్టీ నేతలు కూడా ఎవరూ రాకపోవడంతో రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టడం వల్లనే ఆర్టీసీ అథోగతి పాలైందన్నారు. తమ రాజకీయ స్వార్థం కోసం ఆర్టీసీ కార్మికులను
బజారున పడేయాలని చూశారని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రైవేటీకరణ చేయవద్దని, సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించడానికి చార్జీలు పెంచాలని డిమాండ్ చేసిన నాయకులే నేడు చార్జీల పెంపును వ్యతిరేకించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. డీజిల్ ధర 45 రూపాయలు ఉన్నప్పుడే ఆర్టీసీ చార్జీలు పెంచారని, ప్రస్తుతం డీజిల్ ధర రూ. 70కి చేరుకోవడంతో చార్జీలు పెంచడంలో తప్పేమి లేదని సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారని ప్రభుత్వ విప్ కర్నే ప్రభాకర్ గుర్తు చేశారు. అవసరమైతే చార్జీలు పెంచాలి కానీ, ప్రైవేటీకరించవద్దని ఇదే కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించకుండానే స్వల్పంగా చార్జీలు పెంచి సమ్మెకు పరిష్కార మార్గం చూపిన సీఎం కేసీఆర్‌ను అభినందించాల్సింది పోయి విమర్శించడం ఏమిటని వారు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చీటికి మాటికి ఆర్టీసీ చార్జీలు పెంచిన ఆ పార్టీ నేతలకు దీనిపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు.