తెలంగాణ

ఎక్కడమ్మా సానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 17: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్న సానియా మీర్జా హరిత హారంలో ఎక్కడమ్మా?, ‘డుమ్మా’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో సానియా ఎక్కడా కనిపించ లేదు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలని గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సినీనటులు పిలుపునిస్తుండగా, సానియా మీర్జా మాత్రం కనిపించ లేదు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పేరిట కోటి రూపాయలు తీసుకున్న సానియా కనీసం ఒక్క మొక్కైనా నాటారా? అని ప్రశ్నిస్తూ ఆమెతో కోటి మొక్కలు నాటించాలని, ఆమెతో కోటి తట్టల మట్టి మోయించాలని ఇలా రకరకాలుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్న సానియా మీర్జా ఈ హరిత హారంలో పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిస్తే బాగుండేదన్న అభిప్రాయం వెలువడుతోంది.