తెలంగాణ

వార్డుల విభజన ప్రక్రియకు షెడ్యూల్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 3: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులేస్తుంది. ఇటీవల ఎన్నికల నిర్వాహణపై స్టే ఎత్తివేసిన హైకోర్టు మరోసారి వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ఇచ్చిన ఆదేశాలను అనుసరించి పురపాలక శాఖ మంగళవారం వార్డుల పునర్విభజన ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 18 మున్సిపాల్టీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ నిర్వహించేందుకు మున్సిపల్ అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. వార్డుల పునర్విభజన ముసాయిదాపై అభిప్రాయలు, సూఛనలు, అభ్యంతరాలు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలియచేయాల్సి వుంటుంది. వాటిని ఈనెల 16వ తేదీలోగా పరిష్కరించి వార్డుల విభజన జాబితాను పురపాలక శాఖ సంచాలకులకు అందిస్తారు. 17వ తేదీన మున్సిపాల్టీ వార్డుల పునర్విభజన తుది జాబితాను ప్రకటిస్తారు. గతంలో రూపొందించిన వార్డుల జాబితాలు నిబంధనలకు మేరకు లేకపోవడం, భౌగోళిక సరిహద్ధుల్లో కప్పదాట్లు వేయడం, ఒక ప్రాంతం ఓటర్లను మరో ప్రాంతంలో కలపడం వంటి తప్పులతో జాబితాలు రూపొందించారు. అధికార పార్టీ నేతలు వారికి అనుకూలమై రీతిలో వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాలు రూపొందించారన్న విమర్శలు చోటుచేసుకున్నాయి.