తెలంగాణ

సాగర్ ఎడమ కాల్వకు నీరు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, డిసెంబర్ 3: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎడమ కాల్వ ద్వారా విడుదల చేస్తున్న నీటిని మంగళవారం సాయంత్రం డ్యాం అధికారులు నిలిపివేశారు. ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు వారబందీ పద్ధతిలో ఇప్పటి వరకు 6 విడతలుగా నీటి విడుదల చేశారు. 7వ విడత మరో వారం రోజుల తరువాత విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 590 అడుగులకుగాను 583.20 అడుగులుగా ఉంది. సాగర్ జలాశయం నుండి కుడి కాల్వ ద్వారా 9,965 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా, ఎడమ కాల్వకు సైతం నీటిని నిలిపివేశారు. ఎస్‌ఎల్‌బీసీకి సంబంధించి సాంకేతిక పరమైన అడ్డంకులు ఏర్పడటంతో మంగళవారం నాడు ఎస్‌ఎల్‌బీసీకి విడుదల చేస్తున్న నీటిని సైతం తాత్కాలికంగా ఆపివేశారు. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి 10,227 క్యూసెక్కులు వస్తుండగా అంతే నీటిని సాగర్ జలాశయం నుండి బయటకు వదిలిపెడుతున్నారు. శ్రీశైలంలో 885 అడుగులుగా గాను 887.40 అడుగులు ఉండగా శ్రీశైలానికి ఎగువ నుండి ఎటువంటి నీరు రావడం లేదు.