తెలంగాణ

టెన్త్ ఫలితాల్లో సిద్దిపేట నెంబర్-1 కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 3 : పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నిలువాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. పదవతరగతిలో 10 జీపీఎ సాధించిన విద్యార్థులకు 25వేల రూపాయలు అందచేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం సిద్దిపేట బాలికల ఉన్నత పాఠశాలల్లో సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత అల్పహార సేవ, వోడ ఫోన్ సౌజన్యంతో విద్యార్థులకు రక్తహినత పరీక్షల కార్యక్రమాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ దిశాపై జరిగిన అఘాయిత్యం చాల బాధ కల్గించిందన్నారు. తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలని, మగపిల్లలకు సంస్కారంతో కూడిన విద్యను అందించాలన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లల కన్నా...మగ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మగపిల్లలు ఏం చేస్తునానరనే విషయంపై నిరంతరం పర్యవేక్షించాలన్నారు. విద్యతో పాటు విలువలతో కూడిన సంస్కారాన్ని నేర్పించాలని సూచించారు. మగపిల్లలు మహిళల్లో అమ్మ, అక్క, చెల్లి భావంతో చూడాలన్నారు. తల్లిదండ్రులను తమ కొడుకులను మంచి సంస్కరాన్ని, సామాజిక స్పృహను నేర్పించి సమాజాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు తప్పనిసరిగా యోగాను అభ్యసించాలన్నారు. యోగతో పాటు, సూర్య నమస్కారాలు, ప్రాణయామం చేయటంతో పీజికల్, మెంటల్‌గా ఫిట్‌గా ఉంటారన్నారు. విద్యార్థులు యోగను అభ్యసించటంతో పాటు తల్లిదండ్రులకు నేర్పించాలన్నారు. యోగ అభ్యసించటం వల్ల పని వత్తిడీని తగ్గించుకోవచ్చునన్నారు. బాలికల పాఠశాల నుండి 30 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవటం వల్ల పీఈటీలను అభినందించారు. విద్యార్థులు సెల్‌ఫోన్, టీవీ, చాటింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. తలదించుకొని చదువుకుంటే భవిష్యత్తులో తలెత్తుకొని బతుకవచ్చని సూచించారు. పదవతరగతిలో ఈసంవత్సరం 50 మంది విద్యార్థులు 10జీపీఎ సాధించాలని కోరారు. జిల్లా విద్యాధికారి అన్ని సర్కార్ పాఠశాలలను సందర్శిస్తు 10 తరగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని మంత్రి హరీష్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
జిల్లాలో 68వేల విద్యార్థులకు రక్త హీనత పరీక్షలు
సిద్దిపేట జిల్లాలో వోడ ఫోన్ సహకారంతో 30లక్షల రూపాయలతో 413 ప్రభుత్వ పాఠశాలల్లో 68వేల విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు ఉచిత మందులు,చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. రక్తహీనతతో బాధపడతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి నివారణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సాయంత్రం ట్యూషన్, టీఫిన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు అల్పహరంతో పాటు, ట్యూషన్ చెప్పి, హోంవర్క్‌లు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని సూచించారు. ప్రభుత్వ బాలికల అభివృద్ధికి 25లక్షల రూపాయల మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పాఠశాల పెయింటిగ్, కిచెన్, గ్రౌండ్ పునరుద్ధరణకు నిధులు వినియోగించాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ రోజాశర్మ, జిల్లా విద్యాధికారి రవికాంత్‌రావు, ప్రధానోపాధ్యాయుడు రమేశ్‌బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
*చిత్రం...విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న మంత్రి హరీష్‌రావు, జడ్పీ చైర్మన్, కలెక్టర్