తెలంగాణ

సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జీఓ జారీ అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 909 ప్యాక్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఇందుకు అనుగుణంగా గ్రామాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 573 మండలాలు ఉన్నాయి. ప్యాక్స్ లేని మండలాలు ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో 81 మండలాల్లో ప్యాక్స్ లేవు. మరో 272 మండలాల్లో ఒక్కొక్క సంఘమే ఉంది. ఈ పరిస్థితిలో ప్రతి మండలంలో రెండు ప్యాక్స్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మండల కేంద్రంలో ఒక ప్యాక్ ఉండేలా చూస్తూ, ఒక్కో మండంలో రెండేసి ప్యాక్స్ ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేసేందుకు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సహకార శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.