తెలంగాణ

గ్రీన్ చాలెంజ్‌కి అజారుద్దీన్ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణలో నమోదు అవుతున్న గ్రీన్ ఛాలెంజ్‌కి మద్దతుగా అజారుద్దీన్ స్పందించారు. తెరాస ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు మద్దతుగా హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో హరిత యజ్ఞాన్ని చేపట్టారు. బుధవారం హైదరాబాద్ క్రికెట్ అధ్యక్షుడు ఆజారుద్దీన్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమమని ఆయన కితాబ్ ఇచ్చారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న టీయుఫ్‌ఐడీసీ చైర్మన్ విప్లవ కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి శుభాష్‌రెడ్డి మొక్క నాటారు. ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, వెంకటేష్, పీసీసీఎఫ్ శోభారాణి గ్రీన్ ఛాలెంజ్‌కి మొక్కలు నాటారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, అరికపూడి గాంధీలకు ఎమ్మెల్యే భేతి శుభాష్‌రెడ్డి గ్రీన్ సవాల్ విసిరారు.