తెలంగాణ

సామాజిక సేవకు స్కౌట్స్, గైడ్స్ సిద్ధంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎల్లవేళలా సామాజిక సేవకు సిద్ధంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపు ఇచ్చారు. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు గవర్నర్ ప్యాట్రన్‌గా, ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన ఉద్దేశం ‘సిద్ధంగా ఉండండి’ అని చెబుతూ, విధి నిర్వహణకు శారీరకంగా, మానసికంగా ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని సూచించారు. సామర్థ్య నిరూపరణకు ప్రతిక్షణం పాటుపడాలన్నారు. రాష్టప్రతి నేతృత్వంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన గవర్నర్ల సమావేశంలో తాను ఒక్క దానే్న తెలంగాణలో స్కౌట్స్ అండ్ గైడ్స్ చేస్తున్న సేవల గురించి ప్రస్తావించానని తమిళిసై గుర్తు చేశారు. బాధ్యత గల పౌరులుగా స్కౌట్స్ ఎదగాలని, సామాజిక సేవలో పాల్గొనాలని కోరారు. సమాజంలో నైతిక విలువలు కలిగిన వారిగా పేరుతెచ్చుకోవాలని, మాతృభూమి సేవలో నిమగ్నం కావాలని, పెద్దలు, మహిళల పట్ల గౌరవం కలిగి ఉండాలని, జీవితంలో నీతి, నిజాయితీతో ఉండాలని సూచించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో విద్యార్థులంతా చేరేందుకు రాష్ట్ర, జిల్లా విభాగాలు శ్రద్ద తీసుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్రంలో పనిచేస్తున్న తీరు తెన్నుల గురించి స్టేట్ చీఫ్ కమిషనర్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా వివరించారు. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల యూనిట్లు అత్యద్భుతంగా పనిచేస్తున్నాయని కొనియాడారు. జిల్లాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు శాశ్వత భవనాలను ప్రాధాన్యతాక్రమంగా నిర్మిస్తామన్నారు.
సీనియర్ అధికారులు విజయకుమార్, విజయేంద్ర బోయి తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరచిన స్కౌట్స్, గైడ్స్‌కు మెరిటోరియస్ సర్ట్ఫికెట్లను ఈ సందర్భంగా అందించారు.
*చిత్రం... రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో గవర్నర్ తమిళిసైతో కవిత