తెలంగాణ

జనవరి నుంచి మళ్లీ పల్లె ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: వచ్చే ఏడాది జనవరిలో మరోసారి ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు పంచాయతీరా జ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. పది రోజుల పా టు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామాల సమగ్రాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అన్ని గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రంగా మార్చడంలో ప్రతిఒక్కరూ భాగస్వా మ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో గురువారం గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనం రూ.8,500 పెంచడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ టీఆర్‌ఎస్ కార్మిక విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో
మంత్రి ఎర్రబెల్లి ప్రసంగించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు, కారోబార్‌లు కీలక భూమిక పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఉద్యోగం కోసం పని చేస్తున్నట్టుగా కాకుండా సొంత ఊరి కోసం పనిచేస్తున్నామన్న భావనను పెంపొందించుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీల కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతాభావాన్ని పల్లె ప్రగతిని విజయవంతం చేయడం ద్వారా చూపాలని సూచించారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలను నిర్మించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన చేయని పథకాలు ఎన్నింటినో సీఎం కేసీఆర్ అమలు చేసి చూపించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, మిషన్ భగీరథ ద్వారా మంచినీరు, 24 గంటల విద్యుత్ సరఫరా చేసి చూపించారని అన్నారు. రాష్ట్రం ఏ ప్రాజెక్టు చేపట్టినా కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. బీజేపీ నాయకులు దీనికేమి సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. ఎక్కడ నలుగురు కనిపిస్తే అక్కడికెళ్లి స్పీచ్‌లు దంచడం బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు అలవాటైపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2 లక్షల 71 వేల కోట్లు చెల్లిస్తే, కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 34 వేల రూపాయలు మాత్రమేనని ఎర్రబెల్లి విమర్శించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందకపోయినా అన్ని వర్గాల కోసం ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులు అన్యాయంగా ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి సమ్మెకు దిగి బజారున పడితే మళ్లీ ఆదుకున్నది సీఎం కేసీఆరేనని ఎర్రబెల్లి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని, ప్రజలు, కార్మికుల బాగోగోల గురించి ఆలోచించే ఏకైక నాయకుడని మంత్రి కొనియాడారు. అన్ని గ్రామాలకు త్వరలోనే పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. దీని కోసం గ్రామ పంచాయతీలపై నయా పైసా భారం పడదన్నారు. 45 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా అన్ని గ్రామాలకు శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామని అన్నారు. ఈ పథకాన్ని మొదటి ప్రతిపక్షాలు విమర్శించాయని, అమలు తర్వాత అందరూ ఆ నీళ్లే తాగుతుండడంతో ఎవరూ నోరు మెదపడం లేదన్నారు.

*చిత్రం...సమావేశంలో ప్రసంగిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు